- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jupally Krishna Rao: కళాకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణలోని కళాకారులకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అర్హులైన (Artists) కళాకారులకు పింఛన్లు ఇస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) భరోసా ఇచ్చారు. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కళాకారులు సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని జూపల్లి తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ఆద్వర్యంలో పలువురు కళాకారులు మంత్రి జూపల్లిని కలిశారు. అర్హులైన వృద్ధ కళాకారులకు పింఛన్ మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని, హెల్త్ కార్డులు అందించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీస్తున్నామని, దీనిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు.






