Jupally: కవిత ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు? కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సూటి ప్రశ్న

by Ramesh Naini |

కవిత ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని మంత్రి జూపల్లి ప్రశ్నించారు.

Jupally: కవిత ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు? కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సూటి ప్రశ్న
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు సిగ్గు అనే పదం కేటీఆర్ (KTR)కు గుర్తుకు రాలేదా అంటూ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిగ్గుందా అనే పదం ఇప్పుడు కేటీఆర్‌కు గుర్తు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తుందన్నారు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిశామని ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. స్పీకర్ చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ఒక్క పనైనా చేశారా? వేల కోట్ల రూపాయల అక్రమార్జన జరిగిందని (KCR) కేసీఆర్ కూతురు (Kavitha) కవితనే చెప్తోంది. ఈ ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించారు. కవిత అంశంపై స్పందిస్తే ఒకరి బండారం ఒకరు బయటపెట్టుకోవాల్సి వస్తుందని ఎవరు నోరెత్తడం లేదని విమర్శించారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు సిగ్గులేని పనులు ఎన్నోచేశారని, పెగ్గులు పోసే వారికి రాజ్యసభ అవకాశం ఇచ్చేప్పుడు సిగ్గు అడ్డు రాలేదా అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు చిన్న పిల్లలు కాదు. ఒకరు చెప్తే చేసేవాళ్ళా? ఒకరు తినిపిస్తే తినేవాళ్ళా వారు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వచ్చన వారని స్పష్టం చేశారు. ప్రభుత్వం కూలిపోతుంది అని కేటీఆర్ పదే పదే మాట్లాడుతున్నాడు. ఎలా కూలిపోతుందో స్పష్టం చేయాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే కుట్రతోనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరూ ఏ పార్టీలో చేరలేదు. ఎవరైనా పార్టీ మారితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాను. నేను పార్టీ మారిన సందర్భం వేరు. తెలంగాణ కోసం మాత్రమే వెళ్ళాను. అయితే నేను తప్పు చేసినట్టా..? అని వివరణ ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితి చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అని చెప్పుకొచ్చారు.

Next Story