Jupally: రేవంత్ నల్లమల పులి కాబట్టే పంజా విసిరారు.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్

by Ramesh Naini |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిన్న అచ్చంపేటలో మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.

Jupally: రేవంత్ నల్లమల పులి కాబట్టే పంజా విసిరారు.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిన్న అచ్చంపేటలో మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. (Achampeta) అచ్చంపేటలో కేటీఆర్ అబద్ధాలు చెప్పారని మంత్రి జూపల్లి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులిబిడ్డ కాదని కేటీఆర్ ప్రశ్నిస్తూ మాట్లాడారని మండిపడ్డారు, కండ్ల ఎదుట ఆయన కనబడుతుంటే ఇంకా కబోదిగా మాట్లాడితే ఎలా అని విమర్శించారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాబట్టే పంజా విసిరారు అని, రేవంత్ పంజాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం నిలబడలేదని మంత్రి కౌంటర్ ఇచ్చారు. బాకీ కార్డు చూపిస్తున్న బీఆర్ఎస్ తెలంగాణకు బాకీ పడిందని అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్, 200 యూనిట్ల విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు లాంటి ఆనేక సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. కాంగ్రెస్ పాలన కేవలం రెండేళ్ల అవుతోంది కదా.. వరుసగా ఒక్కో హామీ పూర్తి చేసుకుంటూ వస్తున్నామని, అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ బీఆర్ఎస్ పదేళ్లు పాలన చేసి లక్షల కోట్లు అప్పులు చేసి ఆదాయం వచ్చినా.. చెప్పిన హామీలు అమలు చేయలేని ఆరోపించారు. స్థానిక పోరులో ఎవరి బలం ఏంటో తేలిపోతుందని జూపల్లి స్పష్టం చేశారు.

Next Story