- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలువబోతోంది: మంత్రి జూపల్లి
మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 75శాతానికి తగ్గకుండా వార్డుమెంబర్లు గెలవబోతున్నారని చెప్పారు. గడిచిన రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు తమను గెలిపిస్తున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 75శాతానికి తగ్గకుండా వార్డుమెంబర్లు గెలవబోతున్నారని చెప్పారు. గడిచిన రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు తమను గెలిపిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు కొత్త పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నందుకు తమకు ప్రజలు పట్టండుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని అన్నారు. లోక్ సభ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, సర్పంచుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని కేటీఆర్ స్వయంగా చెప్పారన్నారు. ఆయన చెప్పినట్టుగానే జూబ్లీహిల్స్ ప్రజలు రెఫరెండం ఇచ్చారని అక్కడ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించిందన్నారు. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి తాను ఇంచార్జీగా ఉన్నానని ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పదికిపది గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులుగా ఉన్న అందరినీ విచారిస్తారని చెప్పారు.






