- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి
ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత భూమిని మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించారు.

దిశ, వీపనగండ్ల : ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత భూమిని మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించారు. వీపనగండ్ల మండల కేంద్రంలోని సర్వే నెం. 532/ఆ లో తన పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని క్రీడాకారుల అభివృద్ధి కోసం మినీ స్టేడియం నిర్మాణానికి అందజేస్తూ బుధవారం డిజిటల్ సంతకాలు చేశారు. గతంలో వీపనగండ్ల మండల పర్యటన సందర్భంగా యువత, క్రీడాకారుల అభ్యర్థన మేరకు మినీ స్టేడియం కోసం తన భూమిని ఇస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో భూ బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తూ డిజిటల్ విధానంలో సంతకాలు చేశారు. వీపనగండ్ల మండల తహశీల్దార్ లాగిన్ ద్వారా నిర్వహించిన ఈ ప్రక్రియలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా డిజిటల్ సంతకం చేసి నాలుగు ఎకరాల భూమిని మినీ స్టేడియం కోసం కేటాయించారు.
ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.1.50 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ భూ బదిలీ ప్రక్రియకు సాక్షులుగా వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మునిగొండ గోపి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ డిజిటల్ సంతకాలు చేశారు.మంత్రి జూపల్లి కృష్ణారావు తీసుకున్న ఈ నిర్ణయంపై మండల ప్రజలు, యువకులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత యువతకు మెరుగైన క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు మండల, జిల్లా,రాష్ట్ర, స్థాయి క్రీడాకారులు తీర్చిదిద్దుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






