- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ చూసీ చూసీ అలసిపోతున్నారా..? ఈ ట్రిక్ మీకోసమే!
ఫోన్ చూస్తున్నప్పుడు వెలువడే బ్లూలైట్ ఎక్స్‌పోజర్ అలసటకు దారితీస్తుంది.

దిశ, ఫీచర్స్ : ఒక్కపూట తినకుండా అయినా ఉంటాం కానీ.. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ చూడకుండా ఎవరుంటారు చెప్పండి! అలాగనీ దానికే అతుక్కుపోతే అవస్థలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే మధ్య మధ్యలో విరామం అవసరమని చెబుతున్నారు. అలా కాకుండా ఎప్పుడూ ఆన్‌లైన్‌లో మునిగిపోతే.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
కొందరైతే రాత్రింబవళ్లు ఫోన్ మరీ ఎక్కువగా చూస్తుంటారు. ఈ సందర్భంగా వెలువడే బ్లూలైట్ ఎక్స్‌పోజర్ అధిక అలసటకు, మానసిక రుగ్మతలకు దారితీసే చాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ద్వారా జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణం అవుతుంది. అందుకే ప్రతీ 20 నిమిషాలకో, అరగంటకో బ్రేక్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, సాంకేతిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఇక కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం ప్రకారం.. అప్పటికే ఆన్‌లైన్ వ్యసనంతో ఇబ్బందిపడేవారైతే గనుక మూడు రోజులపాటు (72 గంటల) స్మార్ట్ ఫోన్‌ను పూర్తిగా పక్కన పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అలా సాధ్యంకాకపోతే, ఫోన్ చూడటం తప్పనిసరైతే.. చాలా తక్కువగా వాడటం, కేవలం కమ్యూనికేషన్‌కు మాత్రమే ఉపయోగించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది మెదడు ప్రతిస్పందనలపై సానుకూల ప్రభావం చూపడం ద్వారా ‘బ్రెయిన్ రీసెట్’లో కీ రోల్ పోషిస్తుందనినిపుణులు చెబుతున్నారు.






