Jupally: బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ పని చేయాలి.. మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-07-18 11:46:22  IST  )

బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు.

Jupally: బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ పని చేయాలి.. మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ బాధ్యతారాహిత్యంగా పరిపాలన చేసి తెలంగాణను అధోగతి పాలు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాచేతికి అప్పగించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నదన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి జూపల్లి.. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి పేదలకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. కానీ 22 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. అలాగే 22 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, సన్న వడ్లకు బోనస్, రైతులకు రైతుభరోసా, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామన్నారు.

బీజేపీ మాట్లాడే అర్హత లేదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణ ఏర్పాటును మాత్రం పక్కన పెట్టిందని విమర్శించారు. సోనియా గాంధీ పెద్ద మనసుతో తెలంగాణ ఏర్పాటైందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రం కేంద్రానికి బిల్లు పంపిందని ఇవాళ మాట్లాడుతున్నతెలంగాణ బీజేపీ నేతలు అది ఆమోదింప చేయకుండా సొల్లు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

ఏడాదిన్నర కాంగ్రెస్ పరిపాలన చూస్తే దుఃఖం వస్తున్నదని ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు దుఃఖం వస్తుందో కేసీఆర్ అని ప్రశ్నించారు. మిగులు రాష్ట్రంగా తెలంగాను మీ చేతికి అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారన్నారు. మేమిచ్చిన హామీల అమలు ఆలస్యానికి బీఆర్ఎస్ చేసిన అప్పులే కారణం అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎన్నికలకు ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క మోటర్ ఆన్ చేసి హడావుడి చేశారని దుయ్యబట్టారు.

Next Story