నూతన బ్యాచ్‌కు వెపన్‌ ట్రైనింగ్‌‌.. ఎక్సైజ్‌ అకాడమీలో ఏఈఎస్‌లు, ఎస్సైలకు శిక్షణ ప్రారంభం

by Ramesh Naini |

డ్రగ్స్‌, గంజాయి, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, ఫ్యూరియస్‌ లిక్కర్‌ వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్‌ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

నూతన బ్యాచ్‌కు వెపన్‌ ట్రైనింగ్‌‌.. ఎక్సైజ్‌ అకాడమీలో ఏఈఎస్‌లు, ఎస్సైలకు శిక్షణ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్‌, గంజాయి, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, ఫ్యూరియస్‌ లిక్కర్‌ వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్‌ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (minister jupally krishnarao) తెలిపారు. గత బ్యాచ్‌లకు లభించని ప్రత్యేక అవకాశంగా, ప్రస్తుత శిక్షణ పోందుతున్న బ్యాచ్‌కు వెపన్‌ ట్రైనింగ్‌‌ను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రూప్‌-1 ద్వారా ఎంపికైన ఏఈఎస్‌లు, గ్రూప్‌-2 ద్వారా ఎంపికైన ఎస్ఐల శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎక్సైజ్‌ శిక్షణలోనూ రాటుదేలాలని, ఎక్సైజ్‌ చట్టంపై పట్టు సాధించాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనబరచిన వారిని గుర్తించి యాక్సలరీ ప్రమోషన్లు అందజేస్తామని వెల్లడించారు.

శిక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలు, స్పోర్ట్స్‌ సదుపాయాలు కూడా కల్పిస్తామని అన్నారు. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌ రావు, కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ.. ఎక్సైజ్‌ శాఖను కేవలం ఆదాయాన్ని సమకూర్చే విభాగంగా కాకుండా, చట్ట అమలులో నైపుణ్యం(స్కిల్‌)పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా డ్రగ్స్‌, ఫ్యూరియస్‌ లిక్కర్‌ను అరికట్టడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డి, రంగారెడ్డి డీసీ దశరధ్, ఏఈఎస్‌లు కృష్ణప్రియ, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story