- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Jupalli Krishna Rao : బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) మండి పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) మండి పడ్డారు. ఇటీవల హైదరాబాద్(Hyderabad)లో జరిగిన మిస్ వరల్డ్ 2025(Miss World 2025) పోటీలకు రూ.వందల కోట్లు ఖర్చు చేశారని ప్రభుత్వం మీద అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ అసత్యాలను పూర్తిగా ఖండిస్తున్నానని ప్రకటించారు. వారు చెప్పినట్టు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు నిరూపించాలని బీఆర్ఎస్(BRS) నాయకులకు సవాల్ విసిరారు. తెలంగాణ టూరిజా(Telangana Tourism)నికి ప్రాచుర్యం కల్పించేందుకే మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించామని మరోసారి స్పష్టం చేస్తున్నట్టు తెలిపారు.
ఎన్నో దేశాలు, రాష్ట్రాలు పోటీ పడితే హైదరాబాద్ కు ఈ అవకాశం దక్కిందని గుర్తు చేస్తూ.. ఇంతటి ఘనత దక్కినందుకు ఆనందించాల్సింది పోయి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం తరపున కేవలం రూ.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో టూరిజం ప్రచారానికే రూ.115 కోట్లకుపైగా ఖర్చు చేశారని, ముందు ఆ విషయాల గురించి గులాబీ నేతలు మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.






