ప్ర‌చారం ల‌భించ‌డ‌క‌పోవ‌డ‌మే అస‌లైన లోటు.. టూరిజం ఫెయిర్‌లో మంత్రి జూప‌ల్లి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణ ప‌ర్యాట‌కానికి అనుకున్న స్థాయిలో ప్ర‌చారం ల‌భించ‌డ‌క‌పోవ‌డ‌మే అస‌లైన లోటు అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌చారం ల‌భించ‌డ‌క‌పోవ‌డ‌మే అస‌లైన లోటు.. టూరిజం ఫెయిర్‌లో మంత్రి జూప‌ల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచస్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వ‌న‌రులు తెలంగాణలో (Telangana Tourism) ఉన్నాయ‌ని, అయితే తెలంగాణ ప‌ర్యాట‌కానికి అనుకున్న స్థాయిలో ప్ర‌చారం ల‌భించ‌డ‌క‌పోవ‌డ‌మే అస‌లైన లోటు అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామ‌ని, ప‌ర్యాట‌కంలో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో అత్యున్న‌త స్థాయి టూరిజం కాన్‌క్లేవ్ ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) లో జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్) 2025 ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటీవల నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిందన్నారు. పర్యాటకం కేవలం వినోదం కాకుండా ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడుల‌కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందన్నారు.

వివిధ వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకు రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఇది విస్తృతమైన అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టాలని, వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి చెప్పారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, తెలంగాణలోనే త్వరలో ఒక ఉన్నత స్థాయి టూరిజం కాంక్లేవ్‌ను నిర్వహించనున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమం చ‌ర్చ‌లకు, పెట్టుబడి ప్రణాళికలకు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుందని వెల్ల‌డించారు. మీరు మా రాష్ట్రాన్ని అన్వేషించే టప్పుడు, మా పర్యాటక అవకాశాలను ప్యాకేజ్ చేయటంలో భాగస్వాములు కావాల‌ని, తెలంగాణకు బ్రాండ్ అంబాసడర్లుగా నిలవాల‌ని టూరిజం, ట్రావెల్స్, హ‌స్సిటాలిటీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు.

Next Story