- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అంటే కడుపు మంట: మంత్రి జూపల్లి
by Prasad Jukanti |
తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తేజస్వి వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు అమరవీరుల త్యాగాలను అమానించడమేనని బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అంటే కడుపుమంట అని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజన తో పోల్చడం ఎంపీ అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. తేజస్వి సూర్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా టీ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Next Story






