కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-09 06:00:20  IST  )

కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగిన 40 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మంగళవారం హైదర్‌నగర్‌లోని కల్లు కాంపౌండ్‌లో వీరు కల్లు తాగారు.

కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా
X

దిశ, వెబ్ డెస్క్: కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగిన 16 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మంగళవారం హైదర్‌నగర్‌లోని కల్లు కాంపౌండ్‌లో వీరు కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. బాధితుల్లో నలుగురు మహిళలు సైతం ఉన్నారు. విరేచనాలు, లో బీపీతో బాధపడుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

దీంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాధితులవి నిరుపేద కుటుంబాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. ప్రస్తుతం బాధితులు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారికి మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరమ్మను ఆదేశించారు. ఇక ఈ కల్లు కాంపౌండ్ కాంగ్రెస్ నాయకుడిదే అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపిస్తున్నారు. శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు దీనిని న‌డుపుతున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆడుకుంటే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు.

Next Story