- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాకీలు పెట్టిలేపిన బీజేపీ లేవదు.. కాంగ్రెస్‌వి ఫేక్ సర్వేలు: మంత్రి హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాకీలు పెట్టి లేపిన బీజేపీ లేవదని ఎద్దేవా

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాకీలు పెట్టి లేపిన బీజేపీ లేవదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫేక్ సర్వేలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల టికెట్లను అమ్ముకుంటుందని హరీష్ రావు ఆరోపించారు. పొరపాటున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తెలంగాణను కూడా అమ్మేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని చేసిన తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కేసీఆర్ హాట్రిక్ సీఎం అవుతారని దీమా వ్యక్తం చేశారు.
Next Story






