- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయం ముట్టడి
ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పార్టీ నాయకులు మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.

X
దిశ సిద్దిపేట: ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పార్టీ నాయకులు మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన జీజేపీ నాయకులను జీజేఆర్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు గాడి పల్లి అరుణ నేతృత్వంలో మహిళ నాయకులు మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంను ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్, వెంకటేశం, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






