శిక్షణ పొందిన వారికి కిట్స్.. కాటమయ్య రక్షణ కవచాలకు మంత్రి గ్రీన్ సిగ్నల్

by Ramesh Naini |

రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది.

శిక్షణ పొందిన వారికి కిట్స్.. కాటమయ్య రక్షణ కవచాలకు మంత్రి గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. బీసీ గురుకులాల్లో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ​అధికారులకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ శాఖలో పెండింగ్​లో ఉన్న అంశాలపై చర్చతో పాటు బీసీ విదేశీ విద్యానిధికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా ఉండాలని నిర్ణయించారు.

హాస్టల్‌లు, గురుకుల పాఠశాల అద్దెలు ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే విద్యా సంవత్సరం సమయానికి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, షూస్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా చెట్టు ఎక్కినప్పుడు గీతా కార్మికులు ప్రమాదాలకు గురికాకూడదనే సదుద్దేశ్యంతో రూపొందించిన ‘కాటమయ్య రక్షణ కవచాలు’ శిక్షణ ఇచ్చిన వారికి కిట్స్ అందజేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ గురుకులాల సెక్రెటరీ సైదులు, ఎండీ మల్లయ్య బట్టు, అలోక్ కుమార్ పాల్గొన్నారు.

Next Story