- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల ఖాతాలకు నిధుల బదిలీలు.. ఎలాంటి ఇబ్బందులు లేవన్న మంత్రి గంగుల
by Javid Pasha |
ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా ధాన్యం సేకరణ జరుగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా ధాన్యం సేకరణ జరుగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో ఏక మొత్తంలో 1180 కోట్లను ఈ ఒక్కరోజే రైతుల అకౌంట్లో జమ చేశామన్నారు. రాష్ట్రంలో 7030 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యంలో ఎప్పటికప్పుడు వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ వాటికి అనుగుణంగా రైతుల ఖాతాలకు నిధులను నేరుగా బదిలీ చేస్తున్నామని వివరించారు.
సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతతో నిధుల్ని సమకూర్చుతుండడంతో వెంట వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






