- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ కల్లు బాధితులకి నిమ్స్ లో మంత్రి దామోదర పరామర్శ
కల్తీ కల్లు బాధితులను నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు.

దిశ తెలంగాణ బ్యూరో: కల్తీ కల్లు బాధితులను నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు.వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లను అడిగి బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభావానికి గురైన బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం మొత్తం 31 మంది నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారనీ... అందరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని అన్నారు. అందులో నలుగురికి నిపుణులైన డాక్టర్ల బ్రందం ఆధ్వర్యంలో డయాలసిస్ చేస్తున్నారనీ.. నాలుగైదు రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తుందనీ.. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా తప్పకుండా చర్యలుంటాయని హామీ ఇచ్చారు.






