CM రేవంత్ ఆదేశం.. ఏజీ నివాసానికి మంత్రి దామోదర్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు హైటెక్ సిటీలోని ఏజీ నివాసానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Rajanarasimha) వెళ్లారు.

CM రేవంత్ ఆదేశం.. ఏజీ నివాసానికి మంత్రి దామోదర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు హైటెక్ సిటీలోని ఏజీ నివాసానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Rajanarasimha) వెళ్లారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌(MBBS Counseling)కు సంబంధించిన స్థానికత అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డితో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుతో కలిసి చర్చిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌ ఆల్‌ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, తెలంగాణలో 30 నుంచి ఆగస్టు 6 వరకు కౌన్సెలింగ్‌ జరగనున్నది. వారం రోజుల వ్యవధిలో రాష్ట్ర స్థాయిలో ఆయా యూనివర్సిటీలు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని ఉండాలి. గత నెల 14న నీట్‌ ఫలితాలు విడుదల కాగా, రెండు రోజుల క్రితం కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటించింది. దీంతో మన రాష్ట్రంలో ఈనెల 30న కౌన్సెలింగ్‌ ప్రారంభమై, అక్టోబరు 3తో ముగుస్తుంది.

Next Story