ఉస్మానియా హస్పిటల్ కొత్త భవనాల డిజైన్ పై మంత్రి దామోదర్ సమీక్ష

by Ramesh Goud |

ఉస్మానియా హాస్పిటల్ (Osmania Hospital) నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో భవనాల డిజైన్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha ) సమీక్ష (Review) నిర్వహించారు.

ఉస్మానియా హస్పిటల్ కొత్త భవనాల డిజైన్ పై మంత్రి దామోదర్ సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: ఉస్మానియా హాస్పిటల్ (Osmania Hospital) నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో భవనాల డిజైన్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha ) సమీక్ష (Review) నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ (Health), ఆర్అండ్‌బీ (R&b) శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన కార్యక్రమం (foundation stone laying ceremony) ఉంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ), మంత్రి దామోదర్ రాజనర్సింహ కొత్త బిల్డింగులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త భవనాల డిజైన్ల ఖరారుపై మంత్రి అధికారులతో చర్చించారు.

ఈ నెల 25న జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డిజైన్లలో పలు మార్పులు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి సూచనల ఆధారంగా అధికారులు డిజైన్లలో మార్పులు చేశారు. ఈ మార్పులు చేసిన డిజైన్లను మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అధికారుల ప్రజెంటేషన్ పై మంత్రి పలు సలహాలు ఇచ్చారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం స్థల కేటాయింపు కూడా చేసింది. గోషామహాల్ లో ని పోలీస్ స్టేడియంలో ఉస్మానియా కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, నూతన భవనాల నిర్మాణానికి శర వేగంగా అడుగులు వేసింది.

ఇందులో భాగంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ కొత్త భవనాల నిర్మణానికి శంకుస్థాపన తేదీలను ఖరారు చేశారు. ఆసుపత్రి భవనాల నిర్మాణాలలో ఏ విషయంలోనూ రాజీ పడొద్దని, రాబోయే వదేళ్ల అవసరాలకు తగినట్టుగా అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఆసుపత్రి భవనాలతో పాటు భోదనా సిబ్బందికి, విద్యార్థులకు హస్టల్ వసతుల భవనాలలో కూడా నియమనిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ అధికారులు ఆసుపత్రి భవనాలకు సంబంధించిన నమూనాలకు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భవనాల డిజైన్లలో పలు మార్పులు సూచిస్తూ.. కొత్త డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు.

Next Story