- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం.. సిగాచి ఫార్మా క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు మంత్రి భరోసా
పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధృవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధృవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) పరామర్శించారు. హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలను మంత్రి దామోదర స్వయంగా నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల అందరి ఫోన్ నంబర్లను మంత్రి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రితో పాటు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు తదితర అధికారులు ఉన్నారు.
కాగా, పటాన్‌చెరులోని (Pashamailaram) పాశమైలారంలో సోమవారం (sigachi industries) సిగాచి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు సంబవించి.. 45 మంది కార్మికులు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు నిన్నటి నుంచి పరిశ్రమ వద్ద నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 26 మృతదేహాలు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండగా.. ఇందులో ఇప్పటికే 4 మృత దేహాలను గుర్తించారు.






