- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నెలకు వంద కోట్లు ఇస్తాం’.. మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
ఆరోగ్యశ్రీ(Aarogyasri)పై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యశ్రీ(Aarogyasri)పై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) స్పందించారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. 2014 -2015లో నెలకు రూ.35 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక ఒక్క 2024లోనే 90 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు(Aarogyasri Bills) చెల్లించామని అన్నారు. ఇప్పుడు నెలకు వంద కోట్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. ప్యాకేజీ రేట్లు రివైజ్ చేయడంతో పాటు ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. నెలకు రూ.500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. అది అసాధ్యం అని చెప్పారు. కావాలనే ఇప్పుడు అనవసర రాజకీయం చేస్తున్నారు.. ఆరోగ్యశ్రీ పెండింగ్ ఇవ్వాళ్టిది కాదని స్పష్టం చేశారు. ఆసుపత్రులకు నెల వారిగా నిధుల విడుదల జరుగుతుందని.. సమ్మెకు వెళ్లొదని మంత్రి విజ్ఞప్తి చేశారు.






