ఇది పాపమా? శాపమా? అద్దె భవనాల్లో 600 రెసిడెన్షియల్ స్కూల్స్.. మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

విద్యతోనే ధైర్యం..స్తైర్యం వస్తాయని, జీవన విధానంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

ఇది పాపమా? శాపమా? అద్దె భవనాల్లో 600 రెసిడెన్షియల్ స్కూల్స్.. మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యతోనే ధైర్యం..స్తైర్యం వస్తాయని, జీవన విధానంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2014-2023 వరకు 647 కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించారని, మొత్తం 1023 స్కూళ్లకు గాను 600 స్కూళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ఇది పాపమా? శాపమా? అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో సభ్యులు పటోళ్ల సంజీవ్ రెడ్డి, బాలు నాయక్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కె.శంకరయ్య, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు సమధానంగా మంత్రి మాట్లాడారు.

గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ఫోకస్

రూ.200కోట్లతో 25 ఎకరాల్లో ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మొత్తం 105 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 79 స్కూళ్లకు ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చిందని, వీటిలో 76 స్కూళ్లకు టెండర్లు పూర్తయ్యాయని, 12 స్కూళ్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జూన్ 2027 నాటికి 70, జూన్ 2028 వరకు 9 స్కూళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లోని ఇన్‌స్ట్రక్టర్‌ల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భారతీయ విద్యా భవన్ లో ఏ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తున్నారో ప్రభుత్వం పరిశీలిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story