- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయివేట్ కంటే అద్భుత సేవలు: మంత్రి దామోదర కీలక ప్రకటన
సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను జూన్ 2న ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను జూన్ 2న ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. వెయ్యి పడకలతో అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 50 పడకలను విదేశీయులకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కొత్తపేట, అల్వాల్ టిమ్స్ హాస్పిటల్స్ లోనూ ఇలాగే విదేశీయుల కోసం 50 చొప్పున బెడ్స్ కేటాయిస్తామన్నారు. మెడికల్ టూరిజం ద్వారా ప్రభుత్వ వైద్యరంగానికి మరింత ఊతం కల్పించేందుకు ఈ చర్య దోహం చేస్తుందన్నారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం హైదరాబాద్ కు వైద్య సేవల కోసం ఆఫ్రికన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి అనేక మంది రోగులు వస్తున్నారని... అయితే ప్రభుత్వ రంగంలోనూ వారికి వైద్య సేవలు అందించి ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ తో పోలిస్తే ఎంతో నిపుణులైన వైద్యులు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్నారని... ఎంతో క్రిటికల్ సర్జరీలు చేయడంలో వారు సిద్ధహస్తులన్నారు. అందుకే ప్రైవేటు కంటే అద్భుత సేవలు అందిస్తూ విదేశీయులను సైతం ప్రభుత్వ హాస్పిటల్స్ కు ట్రీట్ మెంట్ కోసం వచ్చేలా చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
మెరుగైన వైద్య సేవలు...
మెడికల్ టూరిజం ద్వారా ప్రభుత్వం ఆదాయం ఆర్జించేందుకు ఎలాంటి చర్యలు తీసుకునాలనే అంశంపై ఓ కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మరోవైపు టిమ్స్ హాస్పిటల్స్ లో అత్యాధునిక వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అన్నారు. మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను సాధారణ వైద్య ఛార్జీలు వసూలు చేసే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. టిమ్స్ హాస్పిటల్స్ లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ తరఫున ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదని... ఇకపై ఏటా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రెఫరల్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రం పరిధిలోని ఏ హాస్పిటల్ నుంచైనా హైదరాబాద్ కు రోగులను పంపించకుండా... కచ్చితంగా సదరు రెఫరల్ ఆసుపత్రికే రెఫర్ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా, గాంధీ తరహాలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని రెఫరల్ ఆసుపత్రిలోనూ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులో ఉంచుతామన్నారు. త్వరలో ముఖ్యమైన ఆసుపత్రులకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామన్నారు. ఫలితంగా వైద్యసేవలు మరింత మెరుగవుతాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్య పరిశోధన విభాగం, డిజిటల్ లైబ్రరీ, స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేసి వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు, మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
నేటి నుంచి హెల్త్ వీక్...
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి నిర్వహించే హెల్త్ వీక్‌ను విజయవంతంగా చేపడతామని తెలిపారు. ఇవాళ ఉదయం నెక్లెస్ రోడ్డులో సుమారు వెయ్యి మందితో ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాక్, అనంతరం జల విహార్ వద్ద నుంచి హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వరకు వాకథాన్, ఉదయం 10 గంటలకు బల్కంపేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఈట్ రైట్ మేళా ఉంటుందన్నారు. ఇక్కడ నాణ్యమైన ఆహార పదార్థాలతో 40 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అక్కడే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు, హోటళ్లకు హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు.






