Minister Raja Narasimha: యువకులు చనిపోవడం విషాదకరం

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-11 16:31:53  IST  )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌(Kondapochamma Reservoir)లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై ఐదుగురు యువకులు చనిపోవడం విషాదకరమని మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) అన్నారు.

Minister Raja Narasimha: యువకులు చనిపోవడం విషాదకరం
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌(Kondapochamma Reservoir)లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై ఐదుగురు యువకులు చనిపోవడం విషాదకరమని మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) అన్నారు. పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి(Collector Manu Chaudhary)ని ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు. అంతకుముందు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గల్లంతైన వారికోసం గజఈత గాళ్లతో గాలింపు చర్యలకు అధికారులకు ఆదేశాలిచ్చారు. జిల్లా అధికారులు దగ్గర ఉండి పరిస్థితిని పర్యవేక్షించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇష్టానుసారంగా తిరగకుండా చూడాలని సూచించారు. వారికి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధించారు.

Next Story