- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగొద్దు.. ఏజీ సుదర్శన్ రెడ్డికి మంత్రి దామోదర విజ్ఞప్తి
ఏజీ సుదర్శన్ రెడ్డి(AG Sudarshan Reddy)తో మంత్రి దామోదర్ రాజనర్సింహా(Minister damodar Rajanarasimha) సమావేశం ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏజీ సుదర్శన్ రెడ్డి(AG Sudarshan Reddy)తో మంత్రి దామోదర్ రాజనర్సింహా(Minister damodar Rajanarasimha) సమావేశం ముగిసింది. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా కోర్టులో వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం, అవసరమైతే సీనియర్ న్యాయవాదుల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా, స్థానికులకే మెడికల్ సీట్లు దక్కేలా గతేడాది ప్రభుత్వం జీవో 33 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ స్థానిక కోటాలో తమకు కూడా సీట్లు ఇవ్వాలని ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కొనసాగుతున్న వాదనలు, ఈ నెల 5న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలోనే ఏజీని కలిసి, స్థానిక విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని మంత్రి కోరారు.






