HYD: ఆయన్ను తక్షణమే తొలగించండి.. ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనపై మంత్రి దామోదర చర్యలు

by Gantepaka Srikanth |

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రం(Erragadda Hospital)లోని రోగులను పరామర్శించారు.

HYD: ఆయన్ను తక్షణమే తొలగించండి.. ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనపై మంత్రి దామోదర చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రం(Erragadda Hospital)లోని రోగులను పరామర్శించారు. నిన్న జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్‌ను వెంటనే తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు.. ఇక మిగిలిన రోగులందరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు మంత్రికి తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్‌పాయిజన్‌ కారణంగా 70 మంది రోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇందులో ఒక మానసిక రోగి కిరణ్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 68 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. ఫుడ్‌పాయిజన్‌ ఎలా జరిగిందనే కోణంలో అధికారుల దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ పరిశీలించారు.

Next Story