- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ థియేటర్‌లు అన్నీ ఒకేచోట ఉండాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) హైదరాబాద్‌లోని గాంధీ అసుపత్రి(Gandhi Hospital)లో ఆకస్మిక పర్యటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) హైదరాబాద్‌లోని గాంధీ అసుపత్రి(Gandhi Hospital)లో ఆకస్మిక పర్యటన చేశారు. గాంధీ అసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అసుపత్రికి వచ్చిన రోగులతో అప్యాయంగా మాట్లాడారు. అనంతరం, గాంధీ అసుపత్రి పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గాంధీ అసుపత్రిలో IVF, IUI సేవల బలోపేతంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అసుపత్రులలో IVF, IUI సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
అలాగే, గాంధీ అసుపత్రిలో ఉన్న సిటీ స్కాన్, MRI SCANలతో పాటు ఇతర హెల్త్ ఎక్విప్‌మెంట్‌లను పూర్తి స్థాయిలో వినియేగంలోకి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హెల్త్ ఎక్విప్‌మెంట్‌లను పూర్తి స్థాయిలో మరమత్తులు చేసేందుకు PMU (ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్)ను ఏర్పాటు చేసుకొని TGMSIDC ఇంజినీరింగ్ అదికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అసుపత్రిలో శానిటేషన్ సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కరానికి STPలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గాంధీ అసుపత్రిలో అన్ని ఆపరేషన్ థియేటర్లు ఒకేచోట ఉండేలా OT Complex ఏర్పాటుపై కమిటీని నియమించి నివేదికను సమర్పించాలని చెప్పారు. గాంధీ అసుపత్రికి వచ్చే పేషెంట్ల సహాయకుల కోసం ప్రస్తుతం ఉన్న షెడ్డు స్థానంలో CSR నిధులతో కొత్తగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని మంత్రి ఆదేశించారు. గాంధీ అసుపత్రిలో వైద్య సేవల బలోపేతానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య సేవల అందించటంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. గాంధీ అసుపత్రిలో OP, IP, సర్జరీలు, స్పెషాలిటీ సేవలు, సూపర్ స్పెషాలిటీ సేవలను అందించేందుకు ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.






