- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Damodar: తెలంగాణలో మరోసారి ఉద్యోగాల భర్తీపై మంత్రి దామోదర కీలక హామీ
తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. 14 నెలల్లో 56 వేల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని వివరించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం కచ్చితంగా ఉద్యోగాలు భర్తీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అయిపోగానే మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశాఖలో 7500 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. కుల, మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి వెన్నెముక.. మీరు లేనిది మేము లేమన్నారు.
కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్, బీజేపీతో దోస్తీ కట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని వివరించారు. రఘునందన్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంతో రఘునందన్ గెలిచారని చెప్పారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకి గుండు సున్నా తెచ్చారని, ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి.. ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిన కూడా సీఎం రేవంత్ రాష్ట్రాన్ని సమర్ధంగా నడిపిస్తున్నారని తెలిపారు.






