- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ దాడుల ముప్పును సమష్టిగా ఎదుర్కొందాం: బండి సంజయ్
దేశంలో డిజిటల్ విప్లవం నడుస్తున్న సమయంలో సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లు, ప్రొఫెషనల్స్, విద్యార్థులను ఒకచోట చేర్చి వారు చేపట్టే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో పౌరులను, సంస్థలతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించాలన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో డిజిటల్ విప్లవం నడుస్తున్న సమయంలో సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లు, ప్రొఫెషనల్స్, విద్యార్థులను ఒకచోట చేర్చి వారు చేపట్టే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో పౌరులను, సంస్థలతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించాలన్నారు. అందుకు అవసరమైన సాధనాలను రూపకల్పన చేసేందుకు వేదికలుగా ‘హ్యాకథాన్’ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందననీయమన్నారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ట్రాక్ చేయడం, డీప్‌ఫేక్ వీడియోలు, వెబ్‌సైట్లు, మొబైల్ అప్లికేషన్లను ఎదుర్కోవడానికి కృషి చేస్తున్నారన్నారు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరాల డైనమిక్ సవాళ్లను ఎదుర్కోవడం ముందున్న ముఖ్యమైన కర్తవ్యమని, వీటిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
గురువారం రామాంతాపూర్ లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో సైఫర్‌కాప్ 2025” అవార్డుల ప్రదానోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందిస్తూ ట్రోఫిలతోపాటు సర్టిఫికెట్లను ప్రదానం చేసి సీడీటీఐ త్రైమాసిక పత్రిక హోరిజన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఒక వ్యక్తి, సంస్థ సైబర్ ముప్పును ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని వాటిని అందరం కలిసికట్టుగా సాంకేతికత సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ సైబర్ ముప్పునుండి రక్షణ కల్పించ వచ్చన్నారు. ప్రధాని మోడీ దూరదృష్టి, సమర్ధవంతమైన నాయకత్వంలో సైబర్ సెక్యూర్ భారత్‌ను నిర్మించడానికి కట్టుబడి ఉన్నామని, సాంకేతిక నైపుణ్యం, అనుభవంతో సైబర్ సెక్యూర్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఢీప్ఫేక్ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం హర్షనీయం :
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఐఎస్బీ BPR&Dతో కలసి ఏఐ, ఎంఎల్క్రిప్టో లావాదేవీలు, డీప్ ఫేక్ సమస్యల వంటి కీలక అంశాలకు పరిష్కారాలు కనుగొనడం ఆనందదాయకమన్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిపుణులు, అకాడమి, ఇండస్ట్రీ నిపుణులను ఒక వేదికపైకి తెచ్చి కఠినమైన సమస్యలకు ఆవిష్కరణాత్మక పరిష్కారాలను కనుగొనట్లు చెప్పారు. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను స్థాపించడం, సైబర్ నేరాల ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ సమస్యలను ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి రోజు కొత్త రకాల ముప్పులు వస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి అందరూ భాగస్వాముల నిరంతర కృషి అవసరం. ఇలాంటి హ్యాకథాన్‌లు, మా ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికోణానికి పూర్తిగా అనుగుణంగా ఉన్నాయి. ప్రపంచ సమస్యలకు స్వదేశీ పరిష్కారాలు అందించే దిశగా ఇవి ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ మిషన్‌లో భారీ సంఖ్యలో యువ మేధావులు పాల్గొనడం సంతోషకరమన్నారు.మనమంతా కలసి కేవలం సైబర్ ముప్పులను ఎదుర్కోవడమే కాదు, ఒక సురక్షితమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నామనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.






