సీఎం రేవంత్‌తో మంత్రి అజారుద్దీన్, క్రిస్టియన్ మైనారిటీ నేతల భేటీ

by Ramesh Naini |

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో పాటు క్రిస్టియన్ మైనారిటీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్‌తో మంత్రి అజారుద్దీన్, క్రిస్టియన్ మైనారిటీ నేతల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో పాటు క్రిస్టియన్ మైనారిటీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డీ. జాన్‌తో కలిసి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు హాజరుకావాలని ముఖ్యమంత్రికి అధికారిక ఆహ్వానం అందజేశారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లపై నేతలు సీఎంతో చర్చించారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story