ఓటర్ల ప్రక్షాళన వేళ మైనారిటీలు జాగ్రత్తగా ఉండాలి.. మంత్రి అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన (SIR) వేళ మైనారిటీలు, అర్హులైన ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రి అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో బీహార్, బెంగాల్‌లలో మైనారిటీ ఓట్లు గల్లంతయ్యాయని అన్నారు.

ఓటర్ల ప్రక్షాళన వేళ మైనారిటీలు జాగ్రత్తగా ఉండాలి.. మంత్రి అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన (SIR) వేళ మైనారిటీలు, అర్హులైన ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రి అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో బీహార్, బెంగాల్‌లలో మైనారిటీ ఓట్లు గల్లంతయ్యాయని అన్నారు. ఇక్కడ అలాంటిది జరగకుండా చూస్తున్నామన్నాని చెప్పారు. సీఎం నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఈనెల 25 నుండి రాష్ట్రంలో సర్ ప్రక్రియ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్ 1 నాటికి తుది ఓటర్ల జాబితా ముగుస్తుంది. ఇందులో భాగంగా ఈనెల 24 నుండి జూలై 25 వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి కనీసం మూడు సార్లు స్వయంగా వచ్చి ఓటర్ వివరాల ఫారాలను పంపిణీ చేస్తారు. వాటి ద్వారా పూర్తి వివరాలను సేకరిస్తారు. ఆన్ లైన్ ద్వారా కూడా వోటర్స్ వెబ్ సైట్ లో ఈ ఫారాన్ని సమర్పించవచ్చు.

Next Story