రాష్ట్రంలోని రైతులకు ఇక పండగే.. సన్నాలకు బోనస్‌పై కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-18 11:17:39  IST  )

రాష్ట్రంలోని రైతాంగానికి రేవంత్ సర్కార్ తీపి‌కబురు అందించింది.

రాష్ట్రంలోని రైతులకు ఇక పండగే.. సన్నాలకు బోనస్‌పై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వానకాలం పంటల సాగు మొదలైన వేళ రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇవాళ సెక్రటేరియట్‌లో నిర్వహించిన అనధికార మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం పంట సాగులో మొత్తం 7 రకాల సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. యాసంగిలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. ఈ నెల 30న మధిరలో భారీ బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రాష్ట్రానికి సరిపడా ఎరువుల కోటాను విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story