- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ ఇబ్బంది ఉన్నా నన్ను కలువు.. మైనార్టీ విద్యార్థినికి మంత్రి భరోసా
ఏ ఇబ్బంది ఉన్నా నన్ను కలువు.. మైనార్టీ విద్యార్థినికి మంత్రి భరోసా

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థిని మహమ్మద్ అసియా ఇటీవల చెన్నైలో జరిగిన కరాటే పోటీలో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తాజాగా మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు తెలిసింది. దీంతో తన పర్యటనలో భాగంగా శుక్రవారం సదరు హన్మకొండ మైనారిటీ విద్యా సంస్థకు వెళ్ళి అసియాను అభినందించారు. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు పత్రాన్ని అసియా, మంత్రి సురేఖకు చూపించి వివరాలు తెలిపారు. తమిళనాడులోని చెన్నై నగరంలో అక్టోబర్5వ తేదీన జరిగిన కరాటే పోటీ ప్రదర్శనలో సుమారు మూడు వేల మంది కరాటే ఛాంపియన్లతో 17 మంది సమన్వయకర్తల మధ్య కేవలం 863 మంది మాత్రమే క్వాలిఫై అయినట్టు తెలిపారు. అయితే, తెలంగాణకు సంబంధించిన అసియా మైనారిటీ గురుకుల విద్యాసంస్థలో చదువుతుండటం విశేశమని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరింత శిఖరాలకు వెళ్లాలని ఆశీర్వదించారు. అందుకోసం ఏమైనా ఇబ్బందులు ఉంటే తమను సంప్రదించాలని మంత్రి సురేఖ ఆమెకు భరోసా ఇచ్చారు.






