- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందు మీ చెల్లి ఆరోపణలకు సమాధానం చెప్పు.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి కౌంటర్
కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. కేటీఆర్ డ్రామారావు.. రామారావు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అన్ని తాము చేసిన పనులు అని చెప్పుకుంటున్నాడని.. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉచిత బస్సులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంట్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు చేశారా అని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. కేటీఆర్ డ్రామారావు.. రామారావు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అన్ని తాము చేసిన పనులు అని చెప్పుకుంటున్నాడని.. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉచిత బస్సులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంట్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు చేశారా అని ప్రశ్నించారు. కేటీఆర్ సోషల్ మీడియా యూనివర్సిటీ ద్వారా ముఖ్యమంత్రిని అవహేళన చేస్తూ మాట్లాడితే గొప్పవాళ్లు అవుతారని అనుకుంటున్నాడని విమర్శించారు. కేటీఆర్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. మీ సోదరి వేరే పార్టీ పెట్టుకుని ఉదయం లేస్తే నిన్ను, మీ నాన్నను, మీ బావను, మీ పార్టీని తిట్టుకుంటూ తిరుగుతుందని అన్నారు. ఇంత మోసగాళ్లు లేరని చెబుతోందని, మా నాన్న చుట్టూ మోసగాళ్లు చేరారని అంటోందని కాబట్టి మొదట నీ ఇంటిని, పార్టీని చక్కబెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.






