మంచి మార్కులు సాధించిన సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు.. మంత్రి అడ్లూరి హర్షం

by Gantepaka Srikanth |

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని, గతేడాదికంటే ఈసారి ఉతీర్ణత శాతం కూడా పెరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

మంచి మార్కులు సాధించిన సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు.. మంత్రి అడ్లూరి హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని, గతేడాదికంటే ఈసారి ఉతీర్ణత శాతం కూడా పెరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురుకుల సొసైటీ అధికారులు, టీచర్‌లను ఆయన అభినందించారు. ఈ మేరకు మంత్రి ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. అధికారులు పరీక్షా ఫలితాల వివరాలను అందించారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 226 గురుకుల విద్యాసంస్థల నుండి మొత్తం 13,611 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే.. అందులో 10,588 మంది ఉత్తీర్ణత సాధించారు.

మొత్తం ఉత్తీర్ణత శాతం 77.79% కాగా, రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం చూస్తే 66.94%గా ఉంది. ఈ సంవత్సరం 12 విద్యాసంస్థల్లో 100కు శాతం 100 శాతం ఫలితాలు సాధించారు. గత మూడు సంవత్సరాల ఫలితాల పోలిస్తే సొసైటీ మంచి ఉత్తర్ణీత శాతాన్ని నమోదు చేస్తోందని అధికారులు చెప్పారు. రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలుల్లో 235 గురుకుల విద్యాసంస్థల నుండి 13,481 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే.. అందులో 11,894 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 88.22% కాగా, రాష్ట్ర సగటు చూస్తే 75.61% గా ఉంది. ఈ సంవత్సరం 41 విద్యాసంస్థలు 100% ఫలితాలు సాధించాయని అధికారులు వెల్లడించారు.

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు..

మొదటి సంవత్సరం:

= ఎంపీసీ: 470లో 468 మార్కులు (7 గురు)

= బైపీసీ: 440లో 438 మార్కులు (5 గురు )

= ఆర్ట్స్: 500లో 494 మార్కులు (ఒక్కరు)

రెండవ సంవత్సరం:

= ఎంపీసీ: 1000లో 995 మార్కులు (ఇద్దరు )

= బైపీసీ: 1000లో 994 మార్కులు (ఒక్కరు )

= ఆర్ట్స్: 1000లో 985 మార్కులు

ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సంస్థ పరిపాలన యొక్క నాణ్యతను ప్రతిబింబిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురుకుల విద్యార్థుల ఉత్తీర్ణతపైన సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యసాచి ఘోష్, గురుకుల సెక్రెటరీ మరియు జాయింట్ సెక్రెటరీలు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story