లక్ష్మీ నరసింహ స్వామి దయతో రెండోసారి ప్రాణాలతో బయట పడ్డ: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

by Malleboina Mahesh |   (  Updated:2025-06-28 16:57:21  IST  )

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఈ రోజు సాయంత్రం పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

లక్ష్మీ నరసింహ స్వామి దయతో రెండోసారి ప్రాణాలతో బయట పడ్డ: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ (Adluri Laxman Kumar)కు ఈ రోజు సాయంత్రం పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కోరుట్ల, మెట్పల్లి లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. మంత్రి కారుకు ప్రమాదం జరిగింది. మెట్‌పల్లి నుండి తన కాన్వాయ్‌తో వస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరపేట వద్ద మంత్రి కాన్వాయ్ కి ఎదురుగా వచ్చిన మరో కారు.. మంత్రి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో మంత్రి ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ కారు ముందు టైరు ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్.. కారును అదుపు చేయడం తో ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.

ఈ ప్రమాదం అనంతరం మంత్రి మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ ప్రమాదం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. యాక్సిడెంట్ గురించి వివరించారు. అలాగే.. ఆ లక్ష్మీ నరసింహ స్వామి దయతో తాను రెండోసారి ప్రాణాలతో బయట పడ్డానని చెప్పుకొచ్చారు. ధర్మపురి ప్రజలకు సేవ చేస్తున్న తనకు స్వామి వారి దయ ఉందని.. ఆయన దయతోనే రెండు సార్లు ప్రాణాలతో బయటపడ్డానని మీడియాతో చెప్పుకొచ్చారు. కాగా గతంలో అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాన్వాయ్ కు యాక్సిడెంట్ కావడంతో.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఈ రోజు రెండో సారి ప్రమాదం జరిగింది.

Read More..

TG: రన్నింగ్‌లో ఊడిపోయిన కారు టైరు.. మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం

Next Story