తెలంగాణలో బొగ్గు గనుల శాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టాలి: అడ్లూరి లక్ష్మణ్

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో బొగ్గు గ‌నుల శాఖ‌లో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెట్టాల‌ని మంత్రి అడ్లూరి లక్ష్మ‌ణ్ అన్నారు. కేంద్రంలో కిష‌న్ రెడ్డి మంత్రిగా ఉన్నార‌ని బొగ్గు గ‌నుల శాఖ ఆయ‌న ప‌రిధిలోకే వ‌స్తుంద‌ని చెప్పారు.

తెలంగాణలో బొగ్గు గనుల శాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టాలి: అడ్లూరి లక్ష్మణ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో బొగ్గు గ‌నుల శాఖ‌లో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెట్టాల‌ని మంత్రి అడ్లూరి లక్ష్మ‌ణ్ అన్నారు. కేంద్రంలో కిష‌న్ రెడ్డి మంత్రిగా ఉన్నార‌ని బొగ్గు గ‌నుల శాఖ ఆయ‌న ప‌రిధిలోకే వ‌స్తుంద‌ని చెప్పారు. వెంట‌నే విజిలెన్స్ తో కిష‌న్ రెడ్డి విచార‌ణ జ‌రిపించాల‌ని అన్నారు. సింగ‌రేణిలో జరిగిన అవినీతిని బ‌య‌ట‌పెట్టాల‌న్నారు. ఏం అవినీతి జ‌రిగిందో, ఏం కుంభ‌కోణాలు జ‌రిగాయో మీ వ‌ద్ద ఉండే అధికారుల‌తో విచార‌ణ జ‌రిపి రిపోర్టును సీబీఐకి అప్ప‌గించాల‌న్నారు.

ఉద‌యం లేస్తే ప‌నికిరాని ముచ్చ‌ట్లు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ముందుగా తెలంగాణ‌కు రావాల్సిన బ‌కాయిల‌ను, నిధుల‌ను తీసుకురావాల‌న్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి ఒక ప‌ది రూపాయ‌లు ఇప్పించాల‌న్నారు. ప్ర‌పంచంలో ఆర్మీ త‌ర‌వాత‌ అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ప‌నిచేసేది సింగ‌రేణి కార్మికులేన‌ని వాళ్లు క‌ట్టే ఇన్ క‌మ్ ట్యాక్స్ మాఫీ చేయించాల‌ని కోరారు.

Next Story