- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రాజకీయల ప్రస్థావన రాకముందు నటుడిగా తెలంగాణ ప్రజలు పవన్ కల్యాణ్ ను అభిమానిస్తారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రాజకీయల ప్రస్థావన రాకముందు నటుడిగా తెలంగాణ ప్రజలు పవన్ కల్యాణ్ ను అభిమానిస్తారని చెప్పారు. పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోతే మరోసారి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని, సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం ప్రభుత్వపరమైన అంశం అని వ్యాఖ్యానించారు. పర్మిషన్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉంటాయని చెప్పారు. దానికి పవన్ కల్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను అన్నదమ్ములుగా గౌరవిస్తారని అన్నారు. ఆంధ్ర ప్రజలను ఎన్నటికీ అవమానించము అని వ్యాఖ్యానించారు. సభకు పర్మిషన్ ఇవ్వలేదని దళితనాయకుడైన అద్దంకి దయాకర్ ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. భారతదేశంలోనే తెలంగాణ ప్రజలకు ఉండే మంచి మనసు, జాలి గుణం మరెవరికి ఉండవని అన్నారు. 2029లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు.






