- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను దేనికి అంటే దానికి సిద్ధం.. కేటీఆర్‍కు మంత్రి అడ్లూరి చాలెంజ్
కేటీఆర్‌ది ఎన్‌ఆర్‌ఐ కోటా అయితే, రేవంత్ రెడ్డిది మెరిట్ కోటా అని.. బీఆర్ఎస్ పాలనలో గురుకులాలకు వసతులు కల్పించలేదని మంత్రి అడ్లూరి విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ హాయాంలొ ఒక్క గురుకుల భవనం నిర్మించినా నేను దేనికి అంటే దానికి సిద్ధం అని కేటీఆర్ ఇదే నా ఛాలెంజ్ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సవాల్ విసిరారు. అధికారంలో ఉండగా పదేళ్లు రాజులాగా కేటీఆర్ విర్రవీగారని దుయ్యబట్టారు. ఇవాళ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ NRI కోటాలొ తెలంగాణలొ పోటీ చేశారని విమర్శించారు. అమెరికా నుంచి వచ్చి మహేందర్ రెడ్డి టిక్కెట్ లాక్కొని కేటీఆర్ పొటీ చేశాడని అంతే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సీఎం వరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంతవరకు వచ్చారన్నారు. కేటీఆర్ (KTR) ది ఎన్ఆర్ఐ కోటా అయితే సీఎం రేవంత్ రెడ్డిది మెరిట్ కోటా అన్నారు.
సంఖ్య పెంచారు తప్ప వసతులేవి?:
గురకులాల సంఖ్య మాత్రమే బీఆర్ఎస్ పెంచిందని మౌళిక వసతులు ఏర్పాటు చేయలేదని మంత్రి విమర్శించారు. గురుకులాలు అన్ని అద్దె భవనాల్లో ఉన్నాయని ఒక్క కొత్త భవనం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించలేదన్నారు. అదే మేము అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. కొప్పుల ఈశ్వర్‍ను కేసీఆర్ మీడియా ముందు దారుణంగా అవమానించారన్నారు. 38 వేల మందికి దళితబంధు ఇచ్చి అందరికీ ఇచ్చామని కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. నేను ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి నన్ను భజం తట్టి ఈ రోజు మంత్రిగా నిలబెట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయని కాలబెడతాం, కూలగొడతాంఅంటే అరెస్ట్ చేయరా అని నిలదీశారు.






