- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MSP: రైతులకు కేంద్రం శుభవార్త.. ఆ పంటపై ఎంఎస్ పై పెంపు
రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జనపనార రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2025-26 సీజన్ కు సంబంధించి ముడి జనపనార (Raw Jute) కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) బుధవారం ఆమోదం తెలిపింది. ముడి జూట్ ఎంఎస్పీ మునుపటి మార్కెటింగ్ సీజన్ 2024-25 కంటే క్వింటాల్‌కు రూ.315 పెంచింది. 2025-26 సీజన్ లో ముడి జనపరాన (టీడీ- 3గ్రేడ్) ముడి జనపరాన కనీస మద్ధతు (MSP) ధర క్వింటాలుకు రూ. రూ. 5650గా నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతులకు 66.8 శాతం రాబడిని ఇస్తుందని కేంద్రం పేర్కొంది. 2014-15 నుండి 2024-25 మధ్య కాలంలో జనపనార సాగు చేసే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం రూ. 1300 కోట్లు కాగా, 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో చెల్లించిన మొత్తం రూ. 441 కోట్లు. 40 లక్షల వ్యవసాయ కుటుంబాల జీవనోపాధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జూట్ పరిశ్రమపై ఆధారపడి ఉంది. దాదాపు 4 లక్షల మంది కార్మికులు జూట్ మిల్లుల్లో ప్రత్యక్ష ఉపాధిని పొందుతున్నారు. అలాగే జూట్ వ్యాపారం చేస్తున్నారు. గతేడాది లక్షా 70 వేల మంది రైతుల నుంచి జనపనారను కొనుగోలు చేశారు. జనపనార రైతులలో 82% పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు కాగా మిగిలిన అస్సాం మరియు బీహార్‌లు జూట్ ఉత్పత్తిలో 9% వాటా కలిగి ఉన్నారు. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) ప్రైస్ సపోర్టు కార్యకలాపాలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుంది. అయితే ఈ కార్యకలాపాలలో ఏవైనా నష్టాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీయింబర్స్ చేస్తుంది.






