- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ క్లిరాటీ ఇవ్వాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నగరంలోని ధర్నా చౌక్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఆమె 72 గంటల నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మె్ల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందని.. ఇవాళ చేస్తున్న నిరాహార దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని కామెంట్ చేశారు. ఆర్థికంగా, సమాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగుపడినప్పుడే.. తెలంగాణ రాష్ట్రం బాగుటుందని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో రాజాధికారంలో ప్రతి వర్గానికి వాటా రావాలన్నారు. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ ఉద్యమాలతో బీసీలకు సంబంధించి రెండు బిల్లులు చట్ట సభల్లో ఆమోదం పొందాయని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరాల్సిందేనని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని నేడు 72 గంటల నిరంతర నిరాహార దీక్ష చేపడుతున్నామని కవిత స్పష్టం చేశారు.
ముస్లింల రిజర్వేషన్‌కు అసెంబ్లీలో బిల్లు పెట్లాలి..
బీసీ రిజర్వేషన్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పింపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కానీ, కేంద్రం ఇది తమ పరధిలోకి రాదని తిరిగి రాష్ట్రానికి పంపే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈ పరిణామాలను ప్రజలంతా గమనించాలని ఆమె పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల పక్షపాతి అయితే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారా.. లేరా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వాలన్నారు. అలా చేస్తేనే బిల్లు ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక ముస్లింలకు అన్యాయం జరగకుండా సపరేట్‌గా అసెంబ్లీలో 10 శాతం రిజర్వేషన్ల బిల్లు పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని అప్పుడు బీజేపీ ఏం చేస్తుందో చూడాలని కవిత అన్నారు.
దీక్షకు అనమతిచ్చేందుకు వణుకెందుకు..
బీసీ రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కవిత హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశామని.. ఆంధ్రావాళ్ల కంటే మీరు పాపం అయ్యారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ధర్నా చౌక్ ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారని.. మరి నేడు తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి సర్కార్‌కు వణుకెందుకని ప్రశ్నించారు. ధర్నా చౌక్ వద్ద 72 గంటలు నిరాహార దీక్షకు ఎట్టి పరిస్థితుల్లో అనుతించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల నుంచి గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కవిత అన్నారు.
ఎక్కడైనా దీక్ష కొనసాగిస్తా.. ఆపే ప్రసక్తి లేదు
బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులో తొమ్మిదేళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదని కవిత తెలిపారు. నాడు ఆ రాష్ట్రం పట్టుపట్టడంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి ఎప్పడైనా శాంతియుతంగానే దీక్షలు చేసిందని తెలిపారు. 72 గంటలు పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తీసుకువెళ్లి పోలీసు స్టేషన్, ఆస్పత్రిలో, ఇంట్లో అయినా సరే దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా.. పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలంతా ఏకం కావాలన్నారు. తనది రాజకీయ పోరాటం కాదని.. బీసీల ఆత్మగౌరవ పోరాటమని ఎమ్మెల్సీ కవిత నినదించారు.






