- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి ఎంఐఎం సపోర్ట్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఎంఐఎం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఎంఐఎం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు ఆయన వెల్లడించారు. సుదర్శన్ రెడ్డితో ఫోన్ మాట్లాడి ఓవైసీ మద్దతు ప్రకటించారు.
ఇదిలా ఉంటే సుదర్శన్ రెడ్డి తెలుగువారు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు మద్దతు తెలపాలని రెండు రాష్ట్రాలకు చెందిన నేతలను కోరుతున్నారు. ఇప్పటికే వైసీపీ, బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నేతలను సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఎన్డీయే తరపున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. సెస్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.






