స్వతంత్ర మహిళా అభ్యర్థిపై ఎంఐఎం నాయకుల దాడి..

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-27 06:49:31  IST  )

నాంపల్లి స్వతంత్ర మహిళా అభ్యర్థిపై దాడి చేసిన ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

స్వతంత్ర మహిళా అభ్యర్థిపై ఎంఐఎం నాయకుల దాడి..
X

దిశ, కార్వాన్ : నాంపల్లి స్వతంత్ర మహిళా అభ్యర్థిపై దాడి కలకలం రేపింది. ఈ ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాంపల్లి స్వతంత్ర అభ్యర్థిగా అంజుమ బేగం (25) నామినేషన్ వేశారు. ఎన్నికలు దగ్గర పడడంతో ఆదివారం మధ్యాహ్నం మురాద్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల ఏర్పాటు కోసం కొంతమంది మహిళలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే స్థానిక కార్పొరేటర్ భర్త మూసా ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టావని, ఆమెపై దాడి చేశాడు.

ఈ క్రమంలో బుర్కాతో పాటు తన బట్టలను కూడా చింపివేశాడని ప్రైవేట్ పార్ట్స్‌ తాకాడు అని ఆరోపించింది. బాధిత మహిళ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రకంగా ఓ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేయడం సమంజసం కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, బాధితురాలు డిమాండ్ చేశారు.

Next Story