రాహుల్ గాంధీ అక్కడికి ఎందుకు వెళ్లలేదు..? ఎంఐఎం

by Satheesh |

తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ చెప్పినట్లుగా ఎంఐఎం నడుచుకుంటోందని ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీనే

రాహుల్ గాంధీ అక్కడికి ఎందుకు వెళ్లలేదు..? ఎంఐఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ చెప్పినట్లుగా ఎంఐఎం నడుచుకుంటోందని ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీనే నిర్ణయిస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ నాంపల్లి కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ మరోసారి ఎంఐఎంను టార్గెట్ చేయగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మజ్లిస్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గోషామహల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. అక్కడ ఏదైనా సెట్టింగ్ జరిగిందా? అని నిలదీశారు. కాగా గోషమహల్‌లో బీజేపీ తరపున రాజాసింగ్ హ్యాట్రిక్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ తరపున సునీతరావు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే రాజాసింగ్‌పై నిత్యం విమర్శలు చేసే ఓవైసీ.. గోషామహల్‌లో మాత్రం తమ అభ్యర్థిని బరిలో నిలపలేదు.

Next Story