చార్మినార్‌ వద్ద ఉద్రిక్తత: ఎంఐఎం కార్పొరేటర్ కుమారుడు మహ్మద్ సాహిల్ అరెస్ట్!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-05 12:06:39  IST  )

చార్మినార్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

చార్మినార్‌ వద్ద ఉద్రిక్తత: ఎంఐఎం కార్పొరేటర్ కుమారుడు మహ్మద్ సాహిల్ అరెస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: చార్మినార్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంఐఎం (MIM) పార్టీకి చెందిన సీనియర్ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ కుమారుడు మహ్మద్ సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. చార్మినార్‌ పాదచారుల జోన్‌ను (Pedestrian Zone) క్రమబద్ధీకరించే క్రమంలో, అక్కడ ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు కార్పొరేటర్ కుమారుడు సాహిల్ అక్కడికి చేరుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగిన సాహిల్, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను తోసేస్తూ, వారితో తీవ్రంగా ఘర్షణకు దిగారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులను బెదిరించడంతో పాటు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సాహిల్‌ను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story