పాక్‌తో ఉద్రిక్తతల ఎఫెక్ట్: హజ్‌ యాత్రికులకు MIM చీఫ్ అసద్ సంచలన పిలుపు

by Gantepaka Srikanth |

భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ హజ్‌కు వెళ్లే యాత్రికులకు ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన పిలుపునిచ్చారు.

పాక్‌తో ఉద్రిక్తతల ఎఫెక్ట్: హజ్‌ యాత్రికులకు MIM చీఫ్ అసద్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ హజ్‌కు వెళ్లే యాత్రికులకు ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన పిలుపునిచ్చారు. శుక్రవారం హజ్ యాత్ర(Haj Pilgrims)కు బయలుదేరే బస్సులను హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసద్ పాల్గొని మాట్లాడారు. ‘పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి కుక్క తోక వంకరలా ఉంది.. సమయం వచ్చినప్పుడు పాకిస్తాన్ బుద్ధిని తప్పకుండా మారుస్తాం.. హజ్‌ యాత్రకు వెళ్లే వాళ్ళంతా పాకిస్తాన్ బుద్ధి మార్చాలని దేవుడిని కోరుకోండి’ అని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. అంతకుముందు హజ్ యాత్రికులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ పవిత్ర యాత్ర వారి జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మరోవైపు దాదాపు 10,000 మంది భారతీయులకు అవకాశం కల్పించేందుకు హజ్‌ పోర్టల్‌ను కంబైన్డ్‌ హజ్‌ గ్రూప్‌ ఆపరేటర్స్‌ (సీహెచ్‌జీవో) కోసం తెరిచినట్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది.

Next Story