- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ (Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం వశమైంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం వశమైంది. ఈ ఎన్నికల్లో మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ (Mirza Riaz ul Hasan Effendi)కి 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు (Dr. N. Gautam Rao)కు 25 ఓట్లు వచ్చాయి. దీంతో 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ విజయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు (Gautam Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో అంటకాగుతోన్న అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) వారికి పూర్తి సంపూర్ణ సహకారాలు అందించిందని కామెంట్ చేశారు.
ఎంఐఎం (MIM) ఏది చెబితే అది తూచా తప్పకుండా కాంగ్రెస్ పని చేసిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని.. కానీ, తాము స్వతంత్రులమంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ ఎన్నికల్లో కార్పొరేటర్ల (Corporators)ను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై ఎలక్షన్ కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) గుర్తింపును కూడా రద్దు చేయాలని గౌతమ్ రావు డిమాండ్ చేశారు.






