Congress: బాకీ కార్డు పేరుతో లేకీ మాటలు.. కేటీఆర్ పై కాంగ్రెస్ ఫైర్

by Prasad Jukanti |

తలకిందుల తపస్సు చేసినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది.

Congress: బాకీ కార్డు పేరుతో లేకీ మాటలు.. కేటీఆర్ పై కాంగ్రెస్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‍ను గత ఎన్నికల్లో ప్రజలు బొంద పెట్టినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతోందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. పదేళ్ల పాలనలో ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయకుండా బాకీ పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో లేకీ మాటలు మాట్లాడుతోందని దుయ్యబట్టారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్‍పై మండిపడ్డారు. బీఆర్ఎస్ చేయని పనులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంటే బీఆర్ఎస్‍కు దుఃఖం ఆగడం లేదన్నారు. తలకిందులు తపస్సు చేసినా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‍లో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో విజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోని దుర్మార్గాలు రాసుకుంటూ పోతే రామాయణం అంతా, చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంత ఉంటుందన్నారు. అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ బీజేపీని మించిపోయిందని విమర్శించారు. కేటీఆర్ తన రాజకీయాలు తాను చేసుకోవాలని అంతే తప్పా రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహిచేంది లేదని హెచ్చరించారు. కేటీఆర్ భజన మండలి ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేసినా కాంగ్రెస్ గెలుపు ఖాయం అన్నారు.

Next Story