- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంపై తప్పుడు ఆరోపణలు : ఈసీకి ఫిర్యాదు చేసిన మెట్టు సాయి కుమార్
కొన్ని మీడియా ఛానల్స్ సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నకిలీ సర్వే రిపోర్టులు ప్రసారం చేస్తున్నారని మంగళవారం ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫిర్యాదు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కొన్ని మీడియా ఛానల్స్ సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నకిలీ సర్వే రిపోర్టులు ప్రసారం చేస్తున్నారని మంగళవారం ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫిర్యాదు చేశారు. కొన్ని మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ఛానళ్లు, కొందరు ఫ్రీలాన్స్రిపోర్టర్ లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సర్వేలు, నిర్ధారణ లేని వార్తలు ప్రసారం చేశారని సాయి కుమార్ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చర్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా దూషణాత్మక నేరం కిందకు వస్తాయన్నారు. తప్పుడు ప్రచారాలు, సీఎం ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకుని, ఇలాంటి దుష్ప్రచారం, నకిలీ సర్వేలు కొనసాగకుండా అడ్డుకోవాలని మెట్లు సాయి కుమార్విజ్ఞప్తి చేశారు.






