- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ : సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro Rail)ను ఫ్యూచర్ సిటీ(Future City) వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రీజనల్ రింగు రోడ్డు, మెట్రో రెండో దశపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో రెండవ దశలో మొత్తం 76.4కిమీల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ పంపింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఈ పనులు మొదలు పెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తోంది సర్కార్. 2వ దశలో మెట్రో శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు విస్తరించనుండగా.. దానిని ఫ్యూచర్ సిటీ వరకు పొడగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ పనులపై దృష్టిసారించిన సీఎం రెడ్డి.. హైదరాబాద్-విజయవాడ గ్రీన్ కారిడార్ పై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు.






